Reduce weight //బరువు తగ్గడానికి ఇలాంటి భోజనం తినండి
గోధుమరవ్వ కిచిడీ
కావలసిన పదార్థాలు
గోధుమరవ్వ: అరకప్పు
పెసరపప్పు: అరకప్పు
నూనె: టేబుల్‌స్పూను
ఆవాలు: అరచెంచా
జీలకర్ర: అరచెంచ
పచ్చిమిర్చి: రెండు
అల్లం తరుగు: చెంచా
టొమాటో తరుగు: అరకప్పు
పచ్చిబఠాణీ: పావుకప్పు
సన్నగా తరిగిన క్యారెట్: అరకప్పు
ఉప్పు: తగినంత
పసుపు: అరచెంచా
కారం: చెంచా
దనియాలపొడి: చెంచా
నీళ్లు: రెండున్నర కప్పులు
కొత్తిమీర: కట్ట
నెయ్యి: టేబుల్‌స్పూను.
తయారీ విధానం
స్టౌమీద కుక్కర్‌ని పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేయించి పచ్చిమిర్చి, అల్లం తరుగు, టొమాటో ముక్కలు, పచ్చిబఠాణీ, క్యారెట్ తరుగు వేసి వేయించుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు, కారం, దనియాలపొడి వేసి కలిపి పెసరపప్పు, గోధుమరవ్వ కూడా వేసి ఓసారి వేయించి... నీళ్లు పోసి మూత పెట్టాలి. నాలుగు కూతలు వచ్చాక స్టౌని కట్టేసి తరువాత మూత తీసి నెయ్యి, కొత్తిమీర తరుగు వేస్తే కిచిడీ రెడీ.
సేమ్య పులావు
కావలసిన పదార్థాలు
నెయ్యి: రెండున్నర టేబుల్‌స్పూన్లు
దాల్చినచెక్క: చిన్న ముక్క
యాలకులు: నాలుగు
జీడిపప్పు: పది
బిర్యానీఆకు: ఒకటి
లవంగాలు: నాలుగు
ఉల్లిపాయలు: రెండు
అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
పచ్చిమిర్చి: రెండు
కారం: చెంచా
పసుపు: చెంచా
కొత్తిమీర తరుగు: నాలుగు టేబుల్‌స్పూన్లు
పుదీనా ఆకులు: పావుకప్ప
పచ్చిబఠాణీ: అరకప్పు
బంగాళాదుంప: ఒకటి
క్యారెట్: ఒకటి
బీన్స్ తరుగు: అరకప్పు
ఉప్పు: తగినంత
పెరుగు: టేబుల్‌స్పూను
సేమియా: ఒకటిముప్పావుకప్పు
నిమ్మరసం: రెండుచెంచాలు.
తయారీ విధానం
స్టౌమీద కుక్కర్‌ని పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీఆకు, జీడిపప్పు వేసి వేయించుకుని ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి కూడా వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు వేసి బాగా కలపాలి. తరువాత కూరగాయముక్కలు, తగినంత ఉప్పు, పెరుగు వేసి వేయించి రెండు నిమిషాలయ్యాక సేమియా, మూడుకప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. మూడు కూతలు వచ్చాక దింపేసి నిమ్మరసంవేయాలి.
బ్రెడ్ ఉతప్పం
కావలసినవి పదార్థాలు
బ్రెడ్‌స్లైసులు: ఆరు
బొంబాయిరవ్వ: అరకప్పు
బియ్యప్పిండి: రెండు టేబుల్‌స్పూన్లు
పెరుగు: పావుకప్పు
ఉప్పు: తగినంత
ఉల్లిపాయ: ఒకటి
టొమాటో: ఒకటి
కొత్తిమీర: కట్ట
కరివేపాకు రెబ్బలు: రెండు
పచ్చిమిర్చి: రెండు
నూనె: అరకప్పు
తయారీ విధానం
బ్రెడ్‌స్లైసుల అంచుల్ని తీసేసి, ఓ గిన్నెలో వేసి చేత్తో మెత్తగా చేసుకోవాలి. ఇందులో రవ్వ, బియ్యప్పిండి, పెరుగు, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి తరువాత తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఇరవై నిమిషాలయ్యాక ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద పెనంపెట్టి ఈ పిండిని మందంగా ఊతప్పంలా వేసి... నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండీ చేసుకోవాలి.
మూడు తేలికగా తయారు చేసుకునే టిఫిన్ బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేసేవారికి రుచిగా చేసుకోగలిగే వంటలు
Comments
Post a Comment